తన ఇద్దరు కుమారులతో కలిసి మహిళ దృశ్యం
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఓ మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి అదృష్టమైన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్(Ghat Kesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాధారం గ్రామానికి చెందిన కుతాడి మౌనిక (31) తన ఇద్దరు కుమారులు చరణ్ (8), నైనేశ్వర్ (4) లతో కలిసి మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఉప్పల్ వెళ్లే బస్సులో ప్రయాణించేందుకు బయలుదేరారు.
అయితే వారు తమ నివాసమైన హయత్‌నగర్‌కు చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మిస్సింగ్(Missing) అయిన ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వారి వివరాలు తెలిసిన వారు ఘట్‌కేసర్ పోలీస్ లను సంప్రదించాలని కోరడమైనది.