ఇంటర్ బోర్డు రద్దు ఒప్పుకోం

18-11-2026 | 05:35am

బీఆర్‌ఎస్ పాలనలో ఐసీయూలో.. రేవంత్ పాలనలో వెంటిలేటర్‌పైకి విద్యావ్యవస్థ

బోర్డు రద్దుతో ఇక్కడి విద్యార్థులకు స్థానికత అంశంలో నష్టం

రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్‌ఎస్ చీఫ్ కవిత

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పాలనలో విద్యావ్యవస్థ(Education System) వెంటిలేటర్ పైకి వెళ్లిందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత(TRS Chief Kavitha) అన్నారు. ‘బీఆర్‌ఎస్ పాలనలో(BRS Rule) ఐసీయూలో ఉన్న విద్యావ్యవస్థ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లింది. ఇంటర్ బోర్డును(Intermediate Board) రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక తెలంగాణ విద్యార్థులకు(Telangana students) స్థానికత అంశంలో నష్టం చేసే కుటిలయత్నం ఉంది.

తన గురువు చంద్రబాబు మెప్పు కోసం ఆంధ్రా ప్రజలకు మేలు చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి ఇంటర్ బోర్డును రద్దు చేసి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆంధ్రా విద్యాసంస్థలకు అనుమతిచ్చే పని చేస్తున్నారు. దీని కారణంగా ఆంధ్రా విద్యాసంస్థల్లో అమలాపురంలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు హైదరాబాద్‌లో పరీక్ష రాసి లోకల్‌గా చెలామణి అయ్యే ప్రమాదం ఉంది’ అని ఆమె మండిపడ్డారు. ‘ఇంటర్ బోర్డు రద్దు - తెలంగాణ విద్యపై ప్రభావం‘ అనే అంశంపై టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ఓ హోటల్ లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావే శం జరిగింది. ఇందులో కవిత మాట్లాడారు.

ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డును విద్యాశాఖలో విలీనం చేయడమనేది విఫల ప్రయోగమనే విషయం ఏపీ చేసిన ప్రయోగం ద్వారా తేలిందన్నారు. విద్యారంగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపక్వత లేని చిన్న పిల్లల మాదిరిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘గతేడాదే ఇంటర్ బోర్డును రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించాక.. అడ్మిషన్లు తీసుకుంటున్నాఇంటర్ బోర్డు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని భావించాం. కానీ మళ్లీ బోర్డును రద్దు చేస్తామని చెప్తున్నారు. ఇది కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయం. ఇలాంటి అంశంలో ఎవరితో చర్చించి నిర్ణయం ప్రకటించారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఐక్య పోరాటాలు చేసైనా అడ్డుకుంటామని కవిత హెచ్చరించారు. 

అనుమానాలు నివృత్తి చేయాలి:- సీనియర్ సంపాదకులు కే శ్రీనివాస్

ఇంటర్ బోర్డు రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్తున్న దాంట్లో చాలా అనుమానాలున్నాయని సీనియర్ సంపాదకుడు కే శ్రీనివాస్ అన్నారు. ఇంటర్ బోర్డు రద్దుతో తలెత్తే స్థానికత అంశంతోపాటు పదో తరగతికి ఉండే ప్రాధాన్యాన్ని తగ్గిస్తారా అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ కే నాగేశ్వర్ మాట్లాడుతూ ఏదైనా పబ్లిక్ పాలసీ అంటే కచ్చితంగా అది ఎవిడెన్స్ బేస్డ్‌గా ఉండాలన్నారు. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ బోర్డు రద్దుతో ప్రయో జనం ఏమిటో ప్రభుత్వం చెప్పలేదని అన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ పాపిరెడ్డి, కనిష్క కోచింగ్ అకాడమీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, శివరాత్రి యాదగిరి, ఎస్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు