రూ.500 టికెట్.. రూ.12 కోట్ల జాక్‌పాట్

18-11-2026 | 09:30am
  1. 15 ఏళ్ల ఎదురుచూపులకు ఫలితం.. ట్రక్కు డ్రైవర్‌కు బంపర్ లాటరీ!

పంజాబ్: అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. పంజాబ్‌కు చెందిన ఓ టిప్పర్ ట్రక్కు డ్రైవర్ విషయంలో ఇదే నిజమైంది. కేవలం రూ.500తో కొనుగోలు చేసిన లాటరీ టికెట్ అతడికి ఏకంగా రూ.12 కోట్ల జాక్‌పాట్‌ను అందించింది. మొహాలీ జిల్లా డేరాబస్సీ సమీపంలోని హమ్యున్‌పూర్‌కు చెందిన 45 ఏళ్ల బల్జీందర్ సింగ్ ఈ భారీ Lottery Jackpot గెలుచుకున్నాడు. గత 15 ఏళ్లుగా ప్రతి పండుగ సమయంలో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న బల్జీందర్‌కు ఎట్టకేలకు అదృష్టం కలిసొచ్చింది.

ఈ దీపావళికి జిరాక్‌పూర్‌లో కొనుగోలు చేసిన Punjab State Dear Diwali Bumper-2026 టికెట్‌కు నవంబర్ 16న జరిగిన డ్రాలో ఫస్ట్ ప్రైజ్ దక్కింది. తనకు రూ.12 కోట్లు వచ్చాయన్న విషయం తెలియగానే ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బహుమతిని క్లెయిమ్ చేసుకునేందుకు అవసరమైన పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ మొత్తాన్ని తన ఇద్దరు పిల్లల ఉన్నత చదువులు, భవిష్యత్తు కోసం వినియోగిస్తానని బల్జీందర్ తెలిపారు. లాటరీ వార్తతో ఆయన గ్రామంలో సందడి నెలకొంది. సాధారణ ట్రక్కు డ్రైవర్‌కు ఒక్క టికెట్‌తో కోట్ల రూపాయల బహుమతి రావడంతో స్థానికులు, బంధువులు అభినందనలు తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలు