పశువులను దొంగలించిన కేసులో నిందితుడు అరెస్ట్
బోథ్,(విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేర గ్రామంలో పశువులను దొంగలించిన కేసు(Cattle Theft Case)లో పరారీలో ఉన్న నిందితుడు అబ్దుల్ సాజిద్ బైంసాకు చెందిన వ్యక్తి ని స్థానికంగా ఉన్న కోరమండల్ దుకాణం వద్ద పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగిందని సీఐ సాయినాథ్(CI Sainath) తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు కలిసి పశువులను దొంగలించి సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో సెప్టెంబర్ నెల 19 తేదీన బైంసా నుండి మ్యాక్స్ బొలెరో పికప్ వాహనంలో బయలుదేరి ఇచ్చోడా మీదుగా సోనాల నుండి సాకెర గ్రామానికి చేరుకోవడం జరిగిందన్నారు.
అక్కడ ఇంటి ముందు కట్టి వేసి ఉన్న ఎడ్లను గుర్తించి అర్ధరాత్రి సమయంలో వాటిని దొంగలించి బైంసాకు తరలించారు. అనంతరం దొంగలించిన ఎళ్లను వధించి మాంసం విక్రయించగా వచ్చిన డబ్బులను ముగ్గురు నిందితులు పంచుకున్నారని సిఐ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇరువురు నిందితులను గతంలోని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని మిగిలిన ఒక వ్యక్తిని మంగళవారం పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించమన్నారు. కార్యక్రమంలో ఎస్సై వి పురుషోత్తం ఉన్నారు.