నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారుల హర్షం
ముత్తారం,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ఆదేశాల మేరకు మంథని మండలం పారుపల్లి గ్రామం(Parupalli Village)లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. మానేరు వాగు ఒడ్డున ఉన్న శత్రాజ్పల్లి ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేద ఎస్టీ కుటుంబాలకు మంజూరైన ఇళ్ల ప్రొసీడింగ్ కాపీల(Copies of house proceedings)ను గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ లు అందజేశారు.
ఈ సందర్భంగా మేకల రజిత (భర్త రవి), భీముని రమ, భీముని శారద, మేకల లక్ష్మిమల్లు, ముంజం అమూల్య తదితరులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme) కింద ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందనుండటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సొంతింటి కల సాకారం కావడానికి కృషి చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పీక శంకర్, యూత్ అధ్యక్షుడు కారుపాకల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.