వస్పులలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

12-11-2026 | 09:48pm

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 

మిడ్జిల్: మిడ్జిల్ మండలం వస్పుల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(MLA Janampally Anirudh Reddy) ప్రారంభించారు. దీంతో లబ్ధిదారులు సొంత ఇంటి కల సహకారమైందన్న సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల(Smart ration cards)ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు