మహబూబ్‌నగర్, జడ్చర్ల జర్నలిస్టులకు అవార్డులు

12-11-2026 | 11:24pm

రాఫె జాకీ, మీర్ అర్షద్ అలీకి స్టేట్ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డులు

జడ్చర్ల: తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (Telangana Urdu Working Journalists Union) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శాంతినగర్ వెట్స్ గార్డెన్‌లో నిర్వహించిన 10వ వార్షిక జనరల్ బాడీ సమావేశం, అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని చేతుల మీదుగా జర్నలిస్టులకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మున్సిఫ్ స్టాఫ్ రిపోర్టర్ రాఫె జాకీ స్టేట్ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డును అందుకోగా, జడ్చర్లకు చెందిన మీర్ అర్షద్ అలీ (ANA న్యూస్) కూడా ఈ అవార్డుతో సత్కారం పొందారు. అదేవిధంగా జడ్చర్లకు చెందిన ఖాజా మొయినుద్దీన్, అబ్దుల్లా, జలీల్ రజా, బాసిత్‌లకు జర్నలిస్టిక్ సేవలను గుర్తిస్తూ ప్రశంసాపత్రాలు, అవార్డులు అందజేశారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, సమాజానికి విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తున్న జర్నలిస్టులను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ అవార్డులు జర్నలిస్టులకు మరింత ఉత్సాహాన్ని, వృత్తిపట్ల అంకితభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు