జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలి
- కులానికి ఒక యూనిక్ కోడ్ ఏర్పాటు చేయాలీ
- అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంఘాల వినతి
హాజీపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల(Hajipur Mandal) కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన గణనలో ఓబీసీ కాలం చేర్చి కులానికి ఒక యూనిక్ కోడ్ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధ వారం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం 1931లో కులగనల చేపడితే దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న బీసీ కులగణన చేపట్టకపోవడం అంటే ఇది బీసీలపై వివక్షగా భావిస్తున్నామన్నారు. పార్లమెంట్ సాక్షిగా బీసీ కులగణనగా చేపడతామని ప్రకటించిన ప్రధాని మాటలు బుట్ట దాకలైందన్నారు. కులగణన చేపట్టాలని దేశంలో, రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తున్న నేపథ్యంలో మా ఉద్యమ ఆకాంక్షను న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు.
జనగణనలో ఓబీసీ కాలం చేర్చితే బీసీల జనాభా బహిర్గతమై చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాల్సిన, అలాగే విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లు పెంచాల్సి వస్తదని కేంద్ర పాలకులు భావిస్తున్నారన్నారు. బీసీ కులగణనకు అనుకూలంగా 10 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినప్పటికీ, అలాగే దేశంలో గుర్తింపు పొందిన 27 రాజకీయ పార్టీలు బీసీ కులగణనలకు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇచ్చినప్పటికీ కులగణన చేపట్టకపోవడం అంటే ఇది బీసీలపై వివక్ష కుట్ర అని పేర్కొన్నారు.
ఇప్పటికైనా జనగణలలో ఓబీసీ కాలం చేర్చి కులానికి ఒక యూనిక్ కోడ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో ఈ అంశాన్ని బీసీ సమాజం ముందు ఎండ కట్టి బిజెపి ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందు దోషిగా నిలబెడతామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పెద్దల్ల చంద్రకాంత్, శకపురి భీమ్సేన్ తదితరులు పాల్గొన్నారు.