విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..
పెద్దపల్లి డిసిపి రామిరెడ్డి
సుల్తానాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి(DCP Ram Reddy) సూచించారు, బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సీఐ పొన్నమనేని రంజిత్ రావు, ఎస్ఐ చంద్రకుమార్ ల ఆధ్వర్యంలో గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై గర్రెపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి డీసీపీ బి. రామిరెడ్డి ప్రవచనకర్త ఎస్పీ నాయక్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, విద్యార్థుల భవిష్యత్తుపై వాటి ప్రభావం, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి లక్ష్యాలతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎలిగేడు ఎస్ఐ మధుకర్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ సుధాకర్, పోలీసు సిబ్బంది, 500 మంది విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.