భక్తిశ్రద్ధలతో బుగ్గ కోనేరులో గంగాహారతి
బెల్లంపల్లి: బుగ్గ కోనేరులో పన్నెండు నదుల పేరిట గంగాహారతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. బుగ్గ రాజేశ్వరస్వామి అన్నదాన ట్రస్ట్ చైర్పర్సన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం జరిగింది.
దేవాలయ అర్చకులు సతీష్ శర్మ వేద మంత్రోచ్ఛరణల నడుమ గంగాహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు జిల్లాపల్లి స్వరూప వెంకటస్వామి, మిట్ట చంద్రయ్య దంపతులు, బాలకృష్ణ, గోపి, అత్తిలి సరోజ, పల్లె భూమేష్, దాతలు గణేష్ స్రవంతి, లక్ష్మి శ్రీహరి, కౌన్సిలర్లు స్రవంతి, కృష్ణవేణి, బత్తుల అనిత సుదర్శన్, దొగుట స్వప్న పాల్గొన్నారు. మిట్ట చంద్రయ్య దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.