అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ప్రజలకు అండగా సీఎంఆర్ఎఫ్ పథకం
సర్పంచ్ నక్క కల్పన రాజు
చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని అక్క పెళ్లి ప్రాతమికొన్నత పాఠశాల ఆవరణలో సీఎంఆర్ఎఫ్(CM Relief Fund Checks) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నక్క కల్పన–రాజు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాతిపెల్లి రమేష్, గ్రామపంచాయతీ అధికారి సిరాజ్, వార్డు సభ్యులు చెడెంక మంతయ్య, నల్లగుంట శ్రీలత–శ్రీనివాస్, నల్లగుంట సంతోష్ తదితరులు పాల్గొన్నారు.