ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య..
కోనరావుపేట నవంబర్ 17 (విజయక్రాంతి): కోనరావుపేట మండలంలో రైతుల సౌకర్యార్థం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను మంగళవారం రోజు ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య(AMC Chairman Ellayya) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని సూచించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ చేపూరి గంగాధర్, కొలనూరు ఫ్యాక్స్ చైర్మన్ బొమ్మన భాస్కర్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ పాషా, మండల అధ్యక్షుడు మానుక సత్యం, ఏఎంసీ డైరెక్టర్లు అజీమ్ పాషా, నాయిని ప్రభాకర్ రెడ్డి, భాషెట్టి నాగరాజు, ఫ్యాక్స్ డైరెక్టర్లు కర్రె శంకరయ్య, నూగురి గణేష్,గోవిందరావుపేట సర్పంచ్ భూక్య తిరుపతి, వట్టిమల్ల సర్పంచ్ జి. వెంకటేష్, గొల్లపల్లి సర్పంచ్ మాడుగుల ఆమని, మరిమడ్ల సర్పంచ్ కోల స్వాతి శ్రీనివాస్, జైసేవాలాల్ ఊరు తండా సర్పంచ్ ఇస్లావత్ మంజుల రవి, నిమ్మపల్లి సర్పంచ్ కమ్మరి స్వప్న, ఐకేపీ ఏపీఎం సుదర్శన్, సీసీలు జనార్దన్ రెడ్డి, జ్యోతి, వీఓఏలు, గ్రామ సమాఖ్య అధ్యక్షులు, మహిళలు పాల్గొన్నారు.