నాలుగు గ్రామాలకు 99 ఆసరా పింఛన్లు మంజూరు
- అడ్డాకుల మండలంలోని నాలుగు గ్రామాలకు 99 ఆసరా పింఛన్లు మంజూరు
- పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి..
- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత..
అడ్డాకుల, నవంబర్ 17 (విజయక్రాంతి): వనపర్తి నియోజకవర్గ పరిధిలోని అడ్డాకుల మండలానికి చెందిన నాలుగు గ్రామాల లబ్ధిదారులకు 99 ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. మంగళవారం పెద్దమందడి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి(MLA Mega Reddy) లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అడ్డాకుల మండలంలోని బలీదుపల్లి గ్రామానికి 30, కన్మనూరుకు 24, పెద్ద మునగల్చెడ్కు 23, చిన్న మునగల్కు 22 చొప్పున మొత్తం 99 ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.1,45,000 విలువైన చెక్కును జి. ఆనంద్ రెడ్డికి ఎమ్మెల్యే మెగా రెడ్డి తన చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలపై కూడా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సద్గుణ, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ కార్యదర్శులు, పింఛన్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.