రాప్తాడు కేసులో కీలక పరిణామం.. రేపు హేమంత్ డిశ్చార్జ్!

17-11-2026 | 06:55pm

కర్నూలు: అనంతపురం జిల్లా రాప్తాడు(Raptadu) ఘటనలో నిందితుడు హేమంత్‌ను రేపు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (Kurnool Government General Hospital) నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. గత నాలుగు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

కోర్టు ఆదేశాల మేరకు హేమంత్‌(Hemanth)కు కర్నూలు జీజీహెచ్‌లో వైద్య సేవలు అందిస్తున్నారు. తాజాగా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జ్‌కు వైద్యులు సిద్ధమయ్యారు. ఆస్పత్రి నుంచి విడుదలైన అనంతరం పోలీసులు అతడిని ప్రత్యేక భద్రత మధ్య అనంతపురానికి తరలించనున్నారు.

రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దాడి కేసులో హేమంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఘటన అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాయాలు, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా పలు ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. కర్నూలు నుంచి అనంతపురానికి తరలింపు పూర్తయిన తర్వాత కేసుకు సంబంధించి తదుపరి న్యాయపరమైన, పోలీసు ప్రక్రియలు కొనసాగనున్నాయి.

మరిన్ని వార్తలు