హెచ్ఐవీ నియంత్రణలో కరీంనగర్కు ప్రత్యేక గుర్తింపు

17-11-2026 | 11:47pm

‘సమ్మాన్ సమారోహ్’లో సురక్షిత్ జిల్లాగా ఎంపిక

కరీంనగర్, నవంబరు 17 (విజయక్రాంతి): హెచ్ఐవీ నియంత్రణలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధనలో మెరుగైన ప్రగతి కనబరిచి కరీంనగర్ జిల్లా(Karimnagar District) ‘సురక్షిత్’ హోదాను దక్కించుకుంది. నాకో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమ్మాన్ సమారోహ్’లో రాష్ట్రంలోని సురక్షిత్ కేటగిరీలో ఎంపికైన 20 జిల్లాల్లో కరీంనగర్ కూడా చోటు సంపాదించింది.

ఈ సందర్భంగా నాకో రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల అధికారులతో కలిసి జిల్లాలో సాధించిన ప్రగతిని వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ సాధించిన ప్రగతిని కొనసాగిస్తూ హెచ్ఐవీ నివారణ, పరీక్షలు, చికిత్స, బాధితులకు నిరంతర వైద్య సేవలు అందించే ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుధా, డీపీఎం సురేందర్ రెడ్డి, డీఐఎస్ శ్రీనివాస్, డీఎంవో సుమన్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు