అర్ధరాత్రి రోడ్డెక్కిన సీపీ.. బైక్పై ఆకస్మిక తనిఖీలు
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలను పరిశీలించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Ramagundam Police Commissioner Amber Kishore Jha) అర్ధరాత్రి బైక్పై పెట్రోలింగ్ నిర్వహించారు. పట్టణ శివారు ప్రాంతాల్లో పోలీసుల నిఘా, పెట్రోకార్, బ్లూకోల్ట్స్ సిబ్బంది పనితీరును సమీక్షించారు.
విధుల్లో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు భద్రతపై నమ్మకం కలిగేలా పెట్రోలింగ్ చేపట్టాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రివేళల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఆయన వెంట మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, రూరల్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఉన్నారు.