చింతగూడ యువకుడికి KU గోల్డ్ మెడల్
29-11-2026 | 04:04pm
గవర్నర్ చేతుల మీదుగా పతకం అందుకున్న రోహిత్ కుమార్
జన్నారం, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన గాలి రోహిత్ కుమార్ కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు కోర్సులో అత్యధిక మార్కులు సాధించి గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రసాద్ శుక్లా(Governor Shivprasad Shukla) చేతుల మీదుగా రోహిత్ కుమార్ బంగారు పతకాన్ని అందుకున్నారు. యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించడంతో చింతగూడ గ్రామస్తులు అభినందించారు.