పొద్దుగూగితే చిమ్మ చీకటే
- అలంకారప్రాయంగా విద్యుత్ దీపాలు
- అవస్థలు పడుతున్న మండల కేంద్ర వాసులు
- పట్టించుకునే వారు కరువు...
- మండల కేంద్రంలోనే ఇలా ఉంటే గ్రామాల్లో మరేలా..?
కోటపల్లి, అక్టోబర్ 5 : మంచిర్యాల జిల్లా(Mancherial District) కోటపల్లి మండల కేంద్రంలోని పొద్దుగూకితే చిమ్మ చీకటి కనిపిస్తుంది. ప్రధాన రహదారిపై విద్యుత్ దీపాల నిర్వహణపై(Maintenance of electric lights) సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో అవి వెలగక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు(Women, elderly, two-wheeler riders) అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారులతో(Main roads) పాటు అంతర్గత వీధుల్లో అనేక విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో రాత్రివేళల్లో చీకట్లు అలుముకుంటున్నాయని స్థాని కులు వాపోతున్నారు.
అవస్థలు పడుతున్న మండల కేంద్ర వాసులు...
మండల కేంద్రంలో విద్యుత్ దీపాల నిర్వహణపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవు తోం ది. అరకొర విద్యుత్ దీపాలతో ప్రధాన వీధు లు, ప్రజలు రాకపోకలు సాగించే ప్రాం తా లు చీకటిమయంగా మారుతున్నాయని స్థా నికులు ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో చీకటి కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రజల రాకపోకలకు కీలకంగా ఉ న్న ప్రాంతాల్లోనే వెలుతురు సరిగా లేకపోవడంతో ప్రమాదాల భయం నెలకొంటోందని చెబుతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పూర్తిస్థాయిలో పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం...
మండల కేంద్రంలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల్లో భాగమైన వీధి దీపాల నిర్వహణను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే వీధి దీపాలు వెలగడం లేదని, వెంటనే మరమ్మతులు చేసి, అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కోటపల్లి మండల కేంద్రాన్ని పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
మరమ్మతులకు పంపించాం
మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వెలగని విద్యుత్ దీపాలను మరమ్మతులు పంపించాం. బతుకమ్మ పండుగ వస్తున్న నేపథ్యంలో కొత్త విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తాం. గ్రామంలో ఎక్కడ విద్యుత్ దీపాలు వెలుగకుంటే తమ దృష్టికి తీసుకువస్తే జీపీ తరపున వెంటనే కొత్త విద్యుత్ దీపాలను అమర్చుతాం.
జగదీష్, పంచాయతీ సెక్రటరీ, కోటపల్లి