కాంట్రాక్టు కార్మికులకు న్యాయమైన వాటా చెల్లించాలి
బెల్లంపల్లి: సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు(Singareni Contract Workers ) లాభాల వాటా మెరుగ్గా ఉండాలని విప్లవ కార్మిక సంఘాలు(Revolutionary Workers' Unions) డిమాండ్ చేశాయి. గత సంవత్సరం రూ. 5,000 లాభాల వాటాను చెల్లించారని, ఈసారి కూడా యథాతథంగా చెల్లించకూడదని ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయం, కుటుంబ అవసరాలను పరిగణనలోకి తీసుకుని లాభాల వాటాను గణనీయంగా పెంచాలని చెల్లించాలని విప్లవ కార్మిక సంఘాల నాయకులు టీ. మణి రామ్ సింగ్, (సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్), అంబాల మహేందర్ (సింగరేణి గని కార్మిక సంఘం) ( ఎం. పోషమల్లు. (శ్రామిక శక్తి గోదావరి లోయ బొగ్గు గాని కార్మిక సంఘం),కోరారు. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికులు, లక్ష్మి, కృష్ణవేణి, రాధా తదితరులు పాల్గొన్నారు.