ప్రయోగశాల సింగరేణి
- అ్రగ్రికల్చర్ వైపు దృష్టి
- బొగ్గు ఉత్పత్తిపై నీలినీడలు
- ఆర్థిక ప్రయోజనం కోసం తంటాలు
- కేకే 2 గని వద్ద ఆయిల్ ఫామ్
- గట్టెక్కించేనా ఈ ప్రయోగాలు
బెల్లంపల్లి, నవంబర్ 2 : సింగరేణి(Singareni) మాగానినీ ప్రయోగశాలగా మార్చారు... బొగ్గు ఉత్పత్తికి(Coal production) మాత్రమే కేంద్రంగా సింగరేణినీ చూశాం, ఇకపై ఆరోజులకు కాలం చెల్లిపోయే క్రమం నడుస్తున్నదనీ అనిపిస్తుంది.. బొగ్గు ఉత్పత్తి(Coal production) ప్రక్రియకే ప్రతీక, అయినా సింగరేణిలో శరవేగమైనా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అనేక రంగాలు సింగరేణి తెరపైకి వస్తున్నాయి. నల్ల బంగారానికి కొంగుబంగారమైనా సింగరేణి బహుళ రంగాల్లోకీ అడుగులు వేస్తున్నది. ఈ పరిణామాలతో బొగ్గు ఉత్పత్తి ప్రసిద్ధిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయా? అనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
అధికారులు అనుసరిస్తున్న విధానాలు ఉత్పత్తి యాగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. క్రమేణా సింగరేణి తన విస్తృతిని ఇతర రంగాలపై మళ్లిస్తున్నది. సకల రంగాల్లోకీ సింగరేణి విస్తరించాలనే యోచనలోనే యాజమాన్యం ఉన్నది. ఏ రంగమైతేనేమీ, సంస్థకు ప్రయోజకరమైతే చాలనట్టు యాజమాన్యం వ్యవహరిస్తున్నది. ఇప్పటికే విద్యుత్ రంగంలోకి అడుగిడింది. తన అవసరాలు తీరే కోణంలో ఆలోచిస్తున్నది. సంస్థ మనుగడకు ఈ పరిణామాలను స్వాగతించాల్సినవే.
అయితే సింగరేణికి పురుడు బోసినా బొగ్గు గనులను విశ్వసించడంపైనే యావత్తు సింగరేణియుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థ నష్టాలకు ఇదే మూలమైంది. ఫలితంగా సింగరేణి సంస్థ సామాజికత్వం దెబ్బతినిపోతున్నదని కార్మికులు ఆందోళన పడుతున్నారు. తొలినాళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కానరావడం లేదు. కొత్తగూడెం, బెల్లంపల్లి, రామగుండం ఏరియాలో ఫవర్ హౌజ్ లు నెలకొల్పారు. అవికాస్త కాలక్రమంలో కొన్ని ప్రాంతాల్లో కనుమరుగయ్యాయి.
ఇదే క్రమంలో మంచిర్యాల జిల్లాలో సింగరేణి మరోభారీ థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను జైపూర్ కేంద్రంగా సొంతంగా ఏర్పాటు చేశారు. ముందు చూపుతో చేపట్టినా ఫవర్ హౌజ్ లు, కంపెనీకి దీర్ఘకాలంగా అమూల్యమైనా సేవలు అందించాయి. బెల్లంపల్లి నుంచి జీఎం ఆఫీసులు, ఇతర విభాగాలు ఎత్తివేత క్రమంలో బెల్లంపల్లి పవర్ హౌజ్ ను కంపెనీ మూసివేసింది. దారి మళ్లించే విధానాలు పారిశ్రామికంగా సింగరేణిని అనేక సంక్షోభాలకు గురిచేసింది. ఈ పరంపరకు సింగరేణి మరింతగా దగ్గరవుతోన్నది.
సంస్థను నష్టాల నుంచి గట్టెక్కెంచేందుకు పొరుగు రాష్ట్రాల్లో గనులను శ్రీకారం చుట్టింది. అందుకు ఒరిస్సా నేనీ బ్లాక్ ఉదహరించవచ్చు. అంతేకాకుండా బంగారు గనుల వైపు సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇటీవల్నే మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ఇలా కొత్త రంగాల దిశగా వెళ్తున్న సింగరేణి తన వేగాన్ని వేగం పెంచుకుంటూపోతుంది. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా అండర్ గ్రౌండ్ గనుల్లో గ్యాస్ వెలికితీతకు మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నది.
బెల్లంపల్లిలో గ్యాసిఫికేషన్ ప్లాంట్ మంజూరు అయ్యింది. ఈ మేరకు పైలెట్ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మరో రంగంలోకి సింగరేణి అడుగు పెట్టింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచేదిగానే కనిపిస్తున్నది. సింగరేణి కంపెనీ అనూహ్యమైనా రీతిలో వ్యవసాయ రంగంలోకి ప్రవేశించింది. మల్టిపుల్ రంగాల్లోకిది తొలి అడుగు. విభిన్నమైనా సాగు రంగాన్ని లాభసాటిగా భావిస్తున్నది. మందమర్రి ఏరియాలో సింగరేణి డైరెక్టర్( పీపీ ) వెంకటేశ్వర్లు కేకే -2 గని పరిసరాల్లో ఐదెకరాల్లో ఆయిల్ ఫామ్ ను ఇటీవలనే ప్రారంభించారు.
సింగరేణి బలోపేతం పేరిట వాణిజ్య పంటలపై ఆసక్తి చూపిడం ఆద్యంతం ఆశ్చర్యం గొలిపుతున్నది. సింగరేణి సంస్థ లాభాల కోసమే ఆయిల్ ఫామ్ ప్లాంట్ ను ఎంచుకున్నట్టు డైరెక్టరే ప్రకటించడం గమనార్హం. అంతే కాదు, సింగరేణిలో ఇతర ఏరియాలో కూడా ఆయిల్ ఫామ్ లను చేపడతామని చెప్పారు. సింగరేణి సంస్థ వ్యవసాయ క్షేత్రం వైపు ప్రయాణంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైవిధ్య భరితమైనా ఈ ఉదంతం సింగరేణిలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
ఆశలు చిగురించేనా..?
ఆయిల్ పామ్ పంటతో సింగరేణినికి ఆశించే లాభాలు తెచ్చిపెడుతాయాన్న చర్చజోరుగా జరుగుతున్నది. మార్కెట్లో ఆయిల్ ఫామ్ భూమ్ అంతగా లేదనీ నిపుణులు పెదవివిరుస్తున్నారు. ఇదే లాభసాటిది అయితే, రైతులు ప్రధాన పంటగా మొగ్గు చూపేవారు కదా? అన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఆయిల్ ఫామ్ పై ప్రచారం తప్పితే మరేమీ లేదు. మార్కెట్లో విక్రయ కేంద్రం లేదు. ఈ నేపథ్యంలో ఆయిల్ ఫామ్ ను సింగరేణికి ఎందుకు ఎంచుకున్నదో ఎవరికీ అంతు పట్టడం లేదు. ఆయిల్ ఫామ్ తో వచ్చే ఆదాయం కనిష్టంగానే ఉంటదనీ నిపుణులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయిల్ ఫామ్ తోటల నిర్వహణను మాత్రం సింగరేణి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆయిల్ ఫామ్ తో వచ్చే ఆదాయం ఎంత? వచ్చే ఆదాయం సింగరేణినీ కాపాడుతుందా? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఆయిల్ ఫాం సాగుపై సింగరేణి భారీ అంచనాలు పెట్టుకున్నదనీ తెలుస్తున్నది. సింగరేణి మనుగడ కోసమని, బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను తక్కువ చూస్తూ అధికారులు కొత్త మార్గాలను ఆశ్రయిస్తున్నారు.
సింగరేణి చరిత్రలో ఇప్పటి వరకు చేపట్టినా ప్రయోగాలేవీ సాఫల్యం అయినా దాఖలాలు లేవనీ పలువురు నిపుణులు అంటునారు. సింగరేణిలో చేపట్టినా యాంత్రీకరణ, కాంట్రాక్టీకరణ, ఈ కోవలోకే వస్తుందీ. ఇదే క్రమంలో మరో సాహసోపేతమైన యూజీసీ గ్యాస్ పక్రియకు అండర్ గ్రౌండ్ గనులను ఎంచుకున్నది. ఈమేరకు గ్యాస్ వెలికతీకు సన్నాహాలు కూడా మొదలు పెట్టారు. ఇది మొదలవ్వక ముందే, ఆయిల్ ఫామ్ ప్లాంట్ కు ఉపక్రమించారు. కంపెనీ లాభ నష్టాలపై కార్మికుల్లో సందేహాలు మెండుగా వ్యక్త మవుతున్నాయి.