ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలు

05-11-2026 | 03:30pm

ఆడిట్ బృందం సమీక్ష

జన్నారం, (విజయక్రాంతి ): మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీలో(Ponakal Major Gram Panchayat) ఉపాధి హామీ పనులపై(employment guarantee works) సామాజిక తనిఖీ బృందం సభ్యులు గురువారం సమీక్షించారు. గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులు, కూలీలకు వేతనాల చెల్లింపులపై ఉదయం నుంచి పొనకల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని నిర్వచేస్తున్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనుల వివరాలను బృందం సభ్యులు పరిశీలించి, పనుల నిర్వహణ, కూలీలకు చెల్లించిన వేతనాలపై సమీక్షించారు. ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకతను పాటించడంతో పాటు పనుల వివరాలను కూలీలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, ఉప సర్పంచ్ అప్పల జలపతి ఈవో రాహుల్ డిఆర్పి రాజు మరియు సామాజిక తనిఖీ సభ్యులు రాజ్ కుమార్, సంజయ్, వార్డు సభ్యులు, పంచాయతీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు