ఆకట్టుకున్న వాగ్దేవి ఫ్రెషర్స్ డే హంగామా

11-11-2026 | 05:26pm

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల(Vagdevi Degree College) ఫ్రెషర్స్ డే వేడుకలు బుధవారం మంచిర్యాల గార్డెన్స్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ ఫ్రెషర్స్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా మంచిర్యాల మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్ (ఎంవీఐ) సురేష్, వాగ్దేవి కళాశాల కరస్పాండెంట్ పెట్టం మల్లయ్యతో కలిసి మాట్లాడారు. విద్యార్థులు ఎంత కష్టమైనా ఇష్టపడి చదవాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని కోరారు.

చెడు వ్యసనాలకు లోను కాకుండా తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చాలని, ప్రస్తుతం కష్టపడితే జీవితాంతం ఉద్యోగంతో ఆనందంగా గడపవచ్చని, ఇప్పుడు ఎంజాయ్ పేరిట సమయాన్ని వృధా చేస్తే జీవితాంతం కష్టపడాల్సి వస్తుందని సూచించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు