కాంగ్రెస్ గ్రామ అధ్యక్షునిగా బియ్యన్ని గోపిరెడ్డి ఎన్నిక
07-10-2026 | 06:28pm
తూప్రాన్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షునిగా బియ్యని గోపిరెడ్డి(Biyyani Gopi Reddy) ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత చిట్కుల్ మహిపాల్ రెడ్డి మనోహరాబాద్ శుభం గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆజ్ఞ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఎక్కడ స్వార్థానికి పోనని హామీ ఇస్తూ ఆజ్ఞ పత్రాన్ని అందుకున్నారు. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నేత భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఆకుల శ్రీరాములు, తదితరులు ఉన్నారు.