ఇందిరమ్మ బీమా తో.. పేద కుటుంబాలకు భరోసా
ఎంపీడీఓ చిన్నరెడ్డి
చేగుంట నవంబర్ 21,(విజయక్రాంతి) : తెలంగాణలోని ప్రతి నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రజా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని చేగుంట ఎంపీడీఓ చిన్న రెడ్డి అన్నారు. ‘ప్రతి ఇంటికి ఒక భరోసా’ అనే నినాదంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance Scheme) శనివారం చేగుంట మండల పరిదిలోని చందాయిపేట్ గ్రామం లొ సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా తో కలిసి ప్రారంభించారు ఈ సందర్బంగా వారు మాట్లాడారు.
కుటుంబ పెద్ద కు ఏదైనా అనుకోని ఆపద సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా జీవిత బీమా ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలనే గొప్ప లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.ప్రతి కుటుంబానికి భద్రత, భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
గ్రామ సర్పంచ్ మహేశ్వరీ సాయిబాబా,తహసిల్దార్ బాల్ లక్ష్మి,ఎంపీడీవో చిన్న రెడ్డి , ఎంపీఓ ప్రకాష్ , మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ ఖాజా అన్న్సోద్దీన్, ఇరిగేషన్ ఏఈ, మిషన్ భగీరథ, హోసింగ్ ఏఈ రియాజోద్దీన్, టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.