బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

14-11-2026 | 05:09pm

* బాల్య వివాహాలు, వెట్టి చాకిరి నిర్మూలనకు ప్రతిజ్ఞ

* ఉపసర్పంచ్ షేక్ హైమద్ బాబా

మోతె, నవంబర్ 14 (విజయక్రాంతి):- బాలల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు(Child welfare, development, and protection of rights) ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూర్యాపేట జిల్లా(Suryapet District) మోతె మండల పరిధిలోని రావిపహాడ్ ఉపసర్పంచ్ షేక్ హైమద్ బాబా కోరారు. బాలల దినోత్సవం(Children's Day) సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో మాట్లాడుతూ బాల్యం అమూల్యమైనదని, పిల్లలకు పౌష్టికాహారం, స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని సూచించారు. బాల్య వివాహాలు(Child Marriages), వెట్టి చాకిరి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ప్రాథమిక పాఠశాలలో(Primary school) నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ(Amma Model School Committee) చైర్మన్ జ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని కష్టపడి చదవాలని సూచించారు. అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకొని కలలను సాకారం చేసుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయుడు నాయకపు పరమేష్ పాఠశాలకు మూడు అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి(MLA Padmavathi Uttam Kumar Reddy) వినతిపత్రం అందించినట్లు తెలిపారు.

విద్యార్థులు జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, కలెక్టర్లు, న్యాయవాదులు, న్యాయమూర్తుల వేషధారణలో ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాయకపు పరమేష్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమృతరెడ్డి, ఉపాధ్యాయులు పాపిరెడ్డి, నరసింహారెడ్డి, నాగరాజు, రంగయ్య, రాజేశ్వరి, రమ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జ్యోతి, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు