అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

14-11-2026 | 05:04pm

కొత్త పెన్షన్ పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): అభివృద్ధి,సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్,  పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్ లో అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా వచ్చిన పెన్షన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్  అందజేస్తున్నాం.

కొత్త పెన్షన్ లు పూర్తి అయిన తరువాత ఎలక్షన్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందజేసే బాధ్యత మన ప్రభుత్వానిది, మీ విజ్జన్నది అని...ఈ నెల 19 వ తేదీన ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నూతన చేయూత పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తుందన్నారు.

ఈ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి  సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, కమిషనర్ రమేష్ , మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, డిఆర్డిఏ పిడి రవీందర్, ఎంపీడీవో దివ్యదర్శనరావు, కౌన్సిలర్ టి కే ప్రభాకర్, సింగిల్ విండో చైర్మన్లు చిలుక సతీష్ , భాస్కర్ రెడ్డి , కల్లపల్లి జానీ, కౌన్సిలర్ లు, ప్రజాప్రతినిధులతో పాటు, అధికారులు, లబ్ధిదారులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు