పెద్దదర్పల్లిలో ఘనంగా బాల గ్రామ సభ

14-11-2026 | 05:02pm

హన్వాడ: మండలంలోని పెద్దదర్పల్లి గ్రామ పంచాయతీలో(Peddadarpalli Gram Panchayat) సర్పంచ్ గుముడాల దీప్తిరఘురాం గౌడ్ అధ్యక్షతన బాల గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కులు(Children's Rights), 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు నిర్బంధ విద్య, బాల కార్మిక నిర్మూలన(Education, Eradication of Child Labor), బాల్య వివాహాల నివారణ, బాలల ఆరోగ్యం, రక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, భద్రత కల్పించడం అందరి బాధ్యతని సర్పంచ్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భారత్ యాదవ్, వార్డు సభ్యులు, కార్యదర్శి, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు