నూతన చేయూతతో మరింత మేలు

14-11-2026 | 04:59pm

మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి 

కోయిలకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి(Former DCC President Kumbham Shiva Kumar Reddy) అన్నారు. మండల కేంద్రంలో నూతన పింఛన్ల చేత మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి నాయకత్వంలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అధికారులతో కలిసి 1,078 మందికి నూతన పింఛన్లు, 164 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 17,639 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు, 39 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ధనంజయ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, విద్యాసాగర్ గౌడ్, వై. పవన్ కుమార్ గౌడ్, రవి నాయక్, సంపత్, భీమయ్య యాదవ్, జి. రవీందర్, సత్యపాల్ రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు