ఎనికెపల్లిలో మొసలి ప్రత్యక్షం

28-10-2026 | 02:40pm

* భయాందోళనలో రైతులు

* మంజీరా నదిలో నీరు లేకపోవడంతో పొలాల్లోకి వచ్చిందంటున్న రైతులు

* సురక్షితంగా పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్న అటవీశాఖ సిబ్బంది 

పాపన్నపేట,అక్టోబర్28: పాపన్నపేట మండల(Papannapet Mandal) పరిధిలోని ఎనికెపల్లి గ్రామ శివారులోని మంజీరా నది(Manjira River) ఒడ్డున ఉన్న వ్యవసాయ పొలాల్లో బుధవారం ఉదయం మొసలి ప్రత్యక్షమైంది. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది గ్రామానికి చేరుకొని సురక్షితంగా మొసలిని పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి రెస్క్యూటీం వచ్చి మొసలిని పట్టుకుంటారని ఎఫ్ఆర్ఓ హిమచందన తెలిపారు.

మంజీరా నదిలో నీరు ఇంకిపోవడంతో మొసలి వ్యవసాయ పొలాల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. వ్యవసాయ పొలాల్లోకి మొసలి రావడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. మంజీరా నది కాలువలో ఇంకా మొసళ్ళు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎఫ్ఆర్ఓ హిమచందన, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్ శారద, సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు