అక్రమ ఇసుక నిల్వలపై రెవెన్యూ అధికారుల కొరడా
* ఆరెపల్లి శివారులో ఇసుక నిల్వలు సీజ్
* అనుమతులు లేకుండా ఇసుక తవ్వితే కఠిన చర్యలు తప్పవు: ఎంఆర్వో, ఆర్‌ఐ
పాపన్నపేట,నవంబర్21: మండల పరిధిలోని ఆరెపల్లి గ్రామ శివారులో(Outskirts of Arepalli village) మంజీరా నది(Manjira River) నుంచి అక్రమంగా ఇసుక తవ్వి నిల్వ చేసిన ఇసుకను రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. శనివారం గ్రామ శివారులో తనిఖీలు నిర్వహించిన పాపన్నపేట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) శరత్, జీపీఓ, పోలీసు సిబ్బంది కలిసి అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 50 ట్రాక్టర్ల ఇసుక నిల్వలను గుర్తించి సీజ్ చేసారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టడం, ఇసుకను అక్రమంగా నిల్వ చేయడం చట్టరీత్యా నేరమని ఆర్‌ఐ పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.