రెడ్డిపల్లి లో చిరుత కలకలం

21-10-2026 | 02:54pm

చేగుంట అక్టోబర్ 21,విజయక్రాంతి : దసరా పండుగ వేడుకలలో(Dasara festival celebrations) ఉన్న గ్రామ ప్రజలకు చిరుత(Leopard) కలకలం కంటిమీద కునుకు లేకుండా చేసింది. గ్రామస్తుల వివరాల ప్రకారం,చేగుంట మండల పరిధిలోని రెడ్డిపల్లి పెద్దమ్మ దేవాలయం(Reddipalli Peddamma Temple) కు జమ్మి చెట్టు పూజ కోసం మేళతాళాలతో భాజ భజంత్రీతో వెళ్లి జంబి చెట్టుకు పూజలు చేసి ముగించుకొని గ్రామస్తులు అందరూ తమ తమ ఇండ్ల కు వెళ్లిపోయారు.

కొద్దిసేపటికి దుర్గామాత వద్ద బతుకమ్మ అమ్మవారి ఆటలు పాటలు అలై బలై కార్యక్రమం కోలాహముగా ఉన్న సమయంలో దేవాలయం సమీపంలో అటుగా వెళుతున్న కారుకు అడ్డంగా మంగళవారం రాత్రి చిరుత రోడ్డు దాటుతుండగా కారులో ఉన్న వ్యక్తులు ఫోన్లో చిత్రీకరించారు. చిరుత వచ్చిన సమాచారం దహనంలో వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

స్థానిక సర్పంచు చిన్నశాని నరసింహ స్థానికులతో కలిసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.పులి వచ్చిన చోటకు వెళ్లి ఏమైనా పులి పాదముద్రలు ఉన్నాయని పరిశీలించారు.

మరిన్ని వార్తలు