బీసీ సమస్యలపై అధికారులతో సంఘం నేతల భేటీ

28-11-2026 | 04:58pm

చేగుంట నవంబర్ 28,విజయక్రాంతి మెదక్ జిల్లా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ(Medak District BC Welfare Association District Committee) ఆధ్వర్యంలో శనివారం జిల్లా అధ్యక్షులు ప్రభు యాదవ్, ప్రధాన కార్యదర్శి ఇప్ప రమేష్, సహాయ కార్యదర్శి మధు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావుని(Medak District SP Srinivas Rao), అదనపు కలెక్టర్ నగేష్‌ను(Additional Collector Nagesh) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా లొ బీసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజల ఇబ్బందులు, సామాజిక న్యాయం తదితర అంశాలపై వారితో చర్చించారు.

బీసీ వర్గాల సంక్షేమం(Welfare of Backward Classes), ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక అభివృద్ధి కోసం తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా సంఘం నాయకులు తెలిపారు. బీసీల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ముందుండి పనిచేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు