పత్తి చేనులో గంజాయి మొక్కలు

28-11-2026 | 06:28pm

భైంసా (విజయక్రాంతి) : తానూర్ మండలం(Tanur Mandal) బెంబెర గ్రామ పరిధిలోని మూడు వ్యవసాయ పొలాల్లో(agricultural fields) గంజాయి సాగును జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) ఆధ్వర్యంలో పోలీస్ బృందం గుర్తించింది.  భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం కార్డన్ అండ్ సెర్చ్(Special police team 'cordon and search' operation)  తనిఖీల్లో పత్తి పంట మధ్యలో సుమారు 250 నుంచి 300 గంజాయి మొక్కలను(cannabis plants) పోలీసులు గుర్తించారు. సంబంధిత వ్యక్తుల ఇంటి వెనుక ఉన్న పొలంలో కోసిన గంజాయిని దాచి ఉంచగా, డాగ్ స్క్వాడ్ శునకాలు గుర్తుపట్టాయి. ఆపరేషన్‌లో ముధోల్ సీఐ రవీందర్ నాయక్, ఆర్ఎస్ఐలు రాకేష్, విజయ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు