ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సహకారంతో లబ్ధిదారులకు చెక్కుల అందజేత
కొల్చారం, నవంబర్ 21 : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి(MLA Sunitha Lakshma Reddy) సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి(CMRF cheques) (సీఎంఆర్ఎఫ్) చెక్కులను శనివారం పైతర గ్రామంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, పైతర గ్రామ సర్పంచ్ యాబన్నగారి రవితేజ రెడ్డి గ్రామంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాబన్నగారి మల్లారెడ్డి, ఉపసర్పంచ్ ఆరట్ల సుధాకర్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.