రేపు జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్
27-11-2026 | 06:31pm
ఆసిఫాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి):జన విజ్ఞాన వేదిక(People's Science Forum) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ పోటీలు (District-level Talent Test Competitions) శనివారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా గైడ్ టీచర్లు సహకరించాలని కోరారు. ఈ మేరకు నిర్వాహకులు వడ్లూరి రాజేష్, సంజయ్ కుమార్, తోడసం సోనేరావు, మారుతి విజేష్ ప్రకటనలో పేర్కొన్నారు.