అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు
సర్పంచ్ రాజిపేట వెంకటేశ్వర్
శివంపేట్ నవంబర్ 18 (విజయ క్రాంతి ): శివ్వంపేట గ్రామపంచాయతీ(Shivvampet Gram Panchayat) ఆధ్వర్యంలో నూతనంగా మంజూరైన పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను గ్రామ సర్పంచ్ రాజిపేట వెంకటేశ్వర్ అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా అర్హులైన నిరుపేదలకు కొత్త పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమైంది.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు ఎంతో ఆసరాగా నిలుస్తాయని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు ముయ్యడి ముత్యాలు,
ఈసారపు ప్రభావతి రాజుగౌడ్, పెద్దగోని శ్రీనివాస్ గౌడ్, దేవునబోయిన బాలమణి కృష్ణ, కోలా కిషన్, కంలయ్యగారి మల్లేశ్వరి నర్సింలు, కొడకంచి స్వాతి గణేష్ గౌడ్, రెడ్డిపల్లి స్వరూప అశోక్, పెద్దకొల విక్రమ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బసంపల్లి రామగౌడ్, మాజీ వార్డు సభ్యులు వంజరి కొండల్, కోవూరి వెంకటేష్, కంలయ్యగారి లక్ష్మి నారాయణ, గ్రామస్థులు ముద్దగల దుర్గేష్, చింతకింది బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.