విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి
లక్ష్మీనగర్ (బి) పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ
పాపన్నపేట,అక్టోబర్28: విద్యార్థులు క్రమశిక్షణతో(Student discipline) విద్యను అభ్యసిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని, కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని లక్ష్మీనగర్(Lakshmi Nagar) (బి) గ్రామస్తులైన బానోతు గోవింద్ నాయక్, పానుగోత్ శ్రీను నాయక్ ఆకాంక్షించారు. బుధవారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల(Government School) విద్యార్థులకు మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి చేతులమీదుగా విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులను(Sports dresses) పంపిణీ చేశారు.
ఆయా కార్యక్రమాల్లో కాంప్లెక్స్ హెచ్ఎం భూజాత, పాఠశాల హెచ్ఎం శిరీష, సర్పంచ్ బుజ్జి, ఉప సర్పంచ్ మురళి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీను, వార్డు సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దాతలైన బానోతు గోవింద్ నాయక్, పానుగోత్ శ్రీను నాయక్ లను ఘనంగా సత్కరించారు.