బోడుప్పల్ సర్కిల్ పరిధిలో రూ.1.25 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం

10-11-2026 | 07:50pm

ప్రారంభించిన మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ 

మేడిపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): మేడ్చల్–మల్కాజిగిరి కార్పొరేషన్(Medchal–Malkajgiri Corporation) బోడుప్పల్ సర్కిల్ పరిధిలో రూ.1.25 కోట్ల అంచన వ్యయంతో చెంగిచెర్ల డివిజన్  సుభోదయ కాలనీ, గ్రీన్ సిటీ కాలనీ, శ్రీలక్ష్మీనగర్, వివేక్ నగర్, లెక్చరర్స్ కాలనీలలో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

స్థానికుల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ కాలనీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ డివిజన్ అధ్యక్షులు పొగుల నర్సింహారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కొత్త శ్రావంతి కిషోర్ గౌడ్, చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షులు పొగుల దిలీప్ రెడ్డి, బోడుప్పల్ డివిజన్ అధ్యక్షులు బొమ్మక్ కళ్యాణ్, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు