అక్రమ నిర్మాణాల కూల్చివేత

27-11-2026 | 10:15pm
  1. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు
  2. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
  3. డిప్యూటీ కమిషనర్ 

మేడిపల్లి, నవంబర్ 27 (విజయక్రాంతి): మున్సిపల్ నిబంధనలను(Municipal regulations) ఉల్లంఘిస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై(illegal constructions) బోడుప్పల్ సర్కిల్ మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. గురువారం అమ్మసాని వెంకట్ రెడ్డి నగర్‌లో(Ammasani Venkat Reddy Nagar) అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ మాట్లాడుతూ.. మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధమని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే కట్టడాలను ఉపేక్షించబోమని, అక్రమ నిర్మాణాలని తేలితే కూల్చివేయడంతో పాటు బాధ్యులపై నిబంధనల ప్రకారం క్రిమినల్ చర్యలు(Criminal proceedings) కూడా తీసుకుంటామని హెచ్చరించారు. భవన నిర్మాణదారులు నిర్మాణ పనులు ప్రారంభించే ముందే సంబంధిత మున్సిపల్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు. మున్సిపల్ నిబంధనలను పాటిస్తూ నిర్మాణాలు చేపట్టాలని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు