అఖిల భారత 36వ మహాసభలు జయప్రదం చేయాలి
సిఐటియు జిల్లా నాయకులు ఎన్. సబిత చింతల యాదయ్య
ఘట్ కేసర్, నవంబర్ 10 (విజయక్రాంతి) : రైతు(Farmer) బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతు(Farmer) పండించే పంట కోట్లాది ప్రజల జీవితాలకి ఆధారమని సిఐటియు జిల్లా నాయకులు(CITU District Leaders) నార్కట్ పల్లి సబిత, చింతల యాదయ్య అన్నారు. మంగళవారం ఘట్ కేసర్ మండల(Ghatkesar Mandal) సీఐటియూ కార్యాలయంలో సిఐటియు మండల స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈసమావేశంలో సీఐటియూ జిల్లా నాయకులు ఎన్. సబిత, చింతల యాదయ్య మాట్లాడుతూ రైతు బలంగా ఉంటేనే వ్యవసాయం బలంగా ఉంటుందనీ వ్యవసాయం బలంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందనీ చెప్పారు.
రైతుల ఐక్యతే మన శక్తి రైతుల హక్కుల సాధనే మన లక్ష్యంగా కృషి చేయాలని చెప్పారు.అఖిలభారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు నల్గొండ లో నవంబర్ 15 నుండి 18వరకు జరుగుతున్నాయని, రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు కె. చంద్రమోహన్ జి. నాగమణి తదితరులు పాల్గొన్నారు..