సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

12-11-2026 | 10:53pm

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్, మేడిపల్లి డివిజన్(Medipally Division) పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీకి చెందిన తిరుమల్ రావు నివాసానికి వెళ్లి, ముఖ్యమంత్రి సహాయ నిధి (Chief Minister Relief Fund) చెక్కును గురువారం మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధ్యక్షులు తుంగతుర్తి రవి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ సహకారంతో ఈ చెక్కును అందించామని తెలిపారు.

'ప్రజా పాలనలో ప్రజల వద్దకే పాలన' అనే లక్ష్యంతో ప్రభుత్వ సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరవేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు, అవసరాలకు స్పందించి అండగా నిలవడమే తమ ప్రధాన లక్ష్యమని తుంగతుర్తి రవి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నరిగే సతీష్, కొమ్ము బంగారయ్య, అక్కల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు