ఘనంగా శ్రీసంత్ సేవలాల్ మహారాజ్ మొదటి వార్షికోత్సవం
ఘట్ కేసర్, నవంబర్ 10 (విజయక్రాంతి): పోచారం డివిజన్ అన్నోజిగూడలోని శ్రీ జగదంబ మాత(Jagadamba Mata Temple) శ్రీసంత్ సేవలాల్ మహారాజ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీజగదాంబ మాత శ్రీసంత్ సేవలాల్ మహారాజ్ 1వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 6.00 గంటలకు గణపతి హోమం, 7.00 గంటలకు అమ్మవారికి అభిషేకం, 8.00గంటలకు అలంకరణ అనంతరం 9.00 గంటలకు చండీయాగం కార్యక్రమం, 10.00 గంటలకు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ వారికీ భోగ్ భండార్ నిర్వహించడం జరిగింది.
అనంతరం మధ్యాహ్నం 1.00 గంటలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అన్న దాత విష్లావత్ జగన్ నాయక్ తో పాటు పాటు ఇందులో ఆలయ కమిటీ చైర్మన్ గుగులోత్ గోవింద్ నాయక్, ఆలయ వైస్ చైర్మన్ విజయ్ సింగ్ నాయక్, ఆలయ ప్రెసిడెంట్ ఆంగోత్ సంతోష్ నాయక్, ఆలయ ప్రధాన కార్యదర్శి ననావత్ రాకేష్ నాయక్, కోశాధికారి విస్లావత్ వినోద్, ననావత్ రాజు నాయక్ లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోచారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, ఐడియా శోబనాథ్ డెవలపర్స్ రవీందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.