అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి

03-11-2026 | 09:50pm

జోనల్ కమిషనర్‌కు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినతి

మల్కాజిగిరి, నవంబర్ 3, విజయ క్రాంతి: మల్కాజిగిరి నియోజక వర్గంలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(Malkajgiri MLA Marri Rajasekhar Reddy) కోరారు. మంగళవారం ఆయన, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్  సంచిత్ గంగ్వార్ ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...మల్కాజిగిరి నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపా యాల కల్పన, చెరువుల అభివృద్ధి, క్రీడా ప్రాంగణాల నిర్మాణం, పార్కుల అభి వృద్ధి తదితర అంశాలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఆర్ డీ పీ) ద్వారా యాప్రాల్ జంక్షన్, అల్వాల్ హైటెన్షన్ లైన్ ప్రాంతం, కార్గిల్ గేట్ నుంచి బాలాజీనగర్ వరకు రోడ్లను అభివృద్ధి చేయా లని కోరారు.

అల్వాల్ గ్రామకంఠంలోని 11 గుంటల స్థలంలో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా ఆమోదం పొందిన ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించి, వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. బండచెరువు, చిన్నరాయుని చెరువులను సమగ్రంగా అభివృద్ధి చేసి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాల న్నారు.

మౌలాలి భరత్ నగర్‌లో మంజూరైన స్విమ్మింగ్ పూల్ నిర్మా ణానికి వక్ఫ్ బోర్డు పరంగా ఉన్న అడ్డంకులను తొలగిం చాలని కోరారు. ఆర్.కే. పురంలో మంజూరైన ఫుట్‌బాల్ గ్రౌండ్ నిర్మాణాన్ని చేపట్టాలని, డిఫెన్స్ కాలనీ లో బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గంలో అదనపు ఏఓసీ రోడ్లతో పాటు సీఆర్‌ఎంపీ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టాలని కోరారు.

హిందూ, ముస్లిం, క్రైస్తవ మైనారిటీల స్మశాన వాటికల్లో ప్రహరీ గోడలు, సీసీ రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించా లని ఆయన కోరారు. విమలాదేవి నగర్‌లో బావి స్థలంలో అక్రమంగా చేపడు తున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, ప్రజా ఆస్తులను పరిరక్షించాలని కోరారు.

నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిపాదించిన సీసీ రోడ్లు, బాక్స్ డ్రైన్ల నిర్మాణం, ఓపెన్ జిమ్ లు, పార్కుల అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్.ఈ. లక్ష్మణ్, మాజీ కార్పొరేటర్లు, చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బద్ధం పరశురాం రెడ్డి, అనిల్ కిషోర్ గౌడ్, అమీ నుద్దీన్, చిన్నయాదవ్, ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, హేమంత్ పటేల్, మాశెట్టి అనిల్, శ్రీనివాస్, సురేష్, చంద్ర మౌళి, ఇబ్రహీం, మోహన్ రెడ్డి,మల్లేశ్ చారి,  విజయ్ రెడ్డి, విజయ్ శేఖర్, యాదగిరి గౌడ్ తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు