మేడ్చల్‌లో ఆలయాలు, మసీదులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలి
మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
తరలివచ్చిన ముస్లిం మైనార్టీ నాయకులు,ఏడు గూళ్ల కమిటీ సభ్యులు
మేడ్చల్ అర్బన్ నవంబర్ 28(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Cyberabad Municipal Corporation) మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి (ఎన్.హెచ్-44) విస్తరణ పనుల్లో భాగంగా దర్గా మసీదుతో పాటు ఏడు గూల్ల ఆలయాన్ని తొలగించాలని జాతీయ రహదారి అధికారులు(National Highway Authorities) నోటీసులు జారీ చేయడంపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వర్యులు మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Chamakura Mallareddy) ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులతో పాటు ఏడు గూళ్ల ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరిని(Medchal-Malkajgiri District Collector Manu Chowdary) కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా స్థానిక ప్రజల ఆధ్యాత్మిక,మత విశ్వాసాలకు ప్రతీకలుగా నిలిచిన ముస్లిం మైనారిటీ లతో పాటు హిందువుల ఆరాధ్య దైవం ఏడు గూళ్ల ఆలయాన్ని తొలగింపు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.మేడ్చల్ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ అనివార్యమైతే ముందుగా వాటిని తొలగింపు కంటే ముందుగా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ప్రభుత్వ ఖర్చులతోనే నూతన మసీదు,ఆలయాలను నిర్మించి ఇవ్వాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఆలయ కమిటీ సభ్యులు,మైనార్టీ నాయకులు సైతం తమ మనోభావాలను దెబ్బతీయకుండా తగిన న్యాయం చేయాలని మాజి మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజి చైర్మెన్ బాదురాదీ భాస్కర్ యాదవ్.స్థానిక మాజి ప్రజా ప్రతినిధులు,అకిటి నవీన్ రెడ్డి.ఎండి అలీ.మైనార్టీ నాయకులు,ఏడు గుళ్ళ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.....