చెత్తగుట్టలకు నిలయాలుగా... జవహర్ నగర్ లోని పలు కాలనీలు

07-10-2026 | 06:50pm

అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు..

ఇది మారుతీ నగర్ కాలనీ దుస్థితి..

జవహర్ నగర్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): చెత్తగుట్టలకు నిలయాలుగా జవహర్ నగర్(Jawahar Nagar)లోని పలు కాలనీలు నిలుస్తున్నాయని మారుతీ నగర్ కాలనీ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ చంద్రపురి కాలనీ 2 మారుతి నగర్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తాచెదారం కారణంగా స్థానికులు తీవ్రమైన దుర్వాసనను ఎదుర్కొంటున్నారని ఫలితంగా అనారోగ్యాల పాలవుతున్నారని ప్రజలు వాపోతున్నారు.

ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లేదని మీడియా వద్ద స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కల బెడదతో పిల్లలు బయటికి రావాలన్న భయపడే పరిస్థితి నెలకొంది అన్నారు. ఈ సమస్యపై సామాజిక సేవకుడు బూడిద వెంకటేష్ మాట్లాడుతూ తక్షణమే చెత్తను తొలగించాలని డిమాండ్ చేశారు.

కాలనీవాసి శ్రీవిద్య మాట్లాడుతూ దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నామని పిల్లలు బయటకు రావడానికి కుక్కల భయంతో వనికి పోతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మునిసిపల్ సిబ్బంది కాలనీలోని చెత్తను డ్రైనేజీ సమస్యల ను పరిష్కరించి ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా  రక్షించాలని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మంజుల, హేమావతి, చంద్రకళ, మీనాక్షమ్మ, సరస్వతీ, శంకరమ్మ, సురేష్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు