దసరా పండుగకు సరైన సినిమా మాది

10-10-2026 | 05:25am

నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజు వెడ్స్ రాంబాయి’(Raju Weds Rambai)ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’(Crazy Kalyanam). భద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్‌మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 16న థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ బూసం జగన్‌మోహన్‌రెడ్డి విలేకరులతో మూవీ హైలైట్స్ పంచుకున్నారు.

“దర్శకుడిగా భద్రప్పకు ఇది మొదటి సినిమా కావొచ్చు కానీ, ఆయన నాతో యాడ్ ఫిలింస్‌కు వర్క్ చేశాడు. ఆయన ప్రతిభ గురించి నాకు తెలుసు. పైగా కథ చాలా బాగుంది కాబట్టి నిర్మించేందుకు ముందుకువచ్చా. దసరా తెలంగాణలో చాలా పెద్ద పండుగ.. ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు చూస్తారు. ప్రతి ఊరిలో, ఇంటిలో జరిగే కథ ఇది. వినోదంతోపాటు మంచి భావోద్వేగాలుంటాయి. ప్రేక్షకులు థియేటర్ నుంచి గుడ్ ఫీల్‌తో బయటకు వస్తారు.

‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలు చూసినప్పటి అనుభూతికి లోనవుతారు. ఈ సినిమా కోసం అనుపమ వర్క్ షాప్స్‌లో పాల్గొని, తెలంగాణ యాస నేర్చుకున్నారు. నరేశ్ కూడా ఇక్కడి మాండలికం నేర్చుకున్నారు. సురేశ్ బొబ్బిలి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. డాక్టర్ గోరటి వెంకన్న మూడు పాటలు, కాసర్ల శ్యామ్ రెండు పాటలు, మిట్టపల్లి సురేందర్ ఒక పాట రాశారు. మా సినిమాను మెదక్ చుట్టుపక్కల గ్రామాల్లో, టౌన్‌లో రూపొందించాం.

వంద శాతం రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. ఈ సినిమా బన్నీ వాస్, సురేశ్ ప్రొడక్షన్స్ చూశారు, వారికి బాగా నచ్చింది.. అందుకే వాళ్లు ఏషియన్ సినిమాస్‌తో కలిసి మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దాదాపు రెండు వందల థియేటర్లలో మా మూవీ రిలీజ్ అవుతోంది. టాక్‌ను బట్టి పెంచుకుందాం అని చెప్పారు. ప్రేక్షకులు ఇచ్చే ఆదరణతో తమిళం, మలయాళ ప్రేక్షకులకు కూడా మా మూవీని చేరువచేయాలని ఉంది. 


మరిన్ని వార్తలు