ఆస్ట్రేలియా ఏ జట్టుదే వన్డే సిరీస్

10-10-2026 | 05:25am

పుదుచ్చేరి, అక్టోబర్ 9: అనధికారిక టెస్ట్ సిరీస్‌ను(Test series) కోల్పోయిన ఆస్ట్రేలియా ఏ జట్టు వన్డే మూడు మ్యాచ్‌ల్లో అనధికారిక వన్డే సిరీస్‌ను(Unofficial ODI series) మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. రెండో అనధికారిక వన్డేలో ఆస్ట్రేలియా 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొ దట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాొో-ఎ జట్టు 49.5 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సామ్ కొన్స్టాస్ (67), జోష్ ఫిలిప్ (58) అర్థసెంచరీలు సాధించారు.

భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ 3 వికెట్లు తీయగా, యశ్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత జట్టు 45.2 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. రజత్ పాటీదార్ (67) అర్థసెంచరీ సాధించగా, చివరలో అనుకుల్ రాయ్ (34నాటౌట్) ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్ 3 వికెట్లు తీయగా, రిలే మెరిడిత్, తన్వీర్ సంగాలు చెరో 2 వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్‌లో ఏడు బంతుల్లో 14 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు తీసిన స్పెన్సర్ జాన్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు