గరివిడి లక్ష్మిఆడిస్తుంది.. పాడిస్తుంది.. కన్నీళ్లు పెట్టిస్తుంది!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్(People Media Factory banner)లో వస్తున్న కొత్త సినిమా ‘గరివిడి లక్ష్మి(Garividi Lakshmi)’. ఇందులో ఆనంది టైటిల్ రోల్‌లో నటిస్తోంది. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలు. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో అడివి శేష్, దర్శకులు బాబీ కొల్లి, హరీశ్‌శంకర్, మారుతి ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ.. “గరివిడి లక్ష్మి’ సినిమా నాకు దేవుడిచ్చిన వరం.
డైరెక్టర్ గౌరీ ప్రాణం పెట్టి పనిచేశారు. కృతి లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్‌కి తప్పకుండా ఈ సినిమాకు రావాల్సిన పేరు వస్తుంది” అని తెలిపింది. డైరెక్టర్ గౌరీ నాయుడు మాట్లాడుతూ.. “విశ్వప్రసాద్ నన్ను చాలా ప్రోత్సహించారు. ఈ సినిమాను నాతో ఒక శిల్పంలాగా చెక్కించారు. ఆనంది స్టేజి ఎక్కితే నాకు పూనకం వచ్చేసేది. సినిమా చూసి ప్రేక్షకులందరూ మురిసిపోతారు. మా ‘గరివిడి లక్ష్మి’ ప్రేక్షకులతో పాడిస్తుంది, ఆడిస్తుంది, కవ్విస్తుంది, నవ్విస్తుంది, కన్నీళ్లు పెట్టిస్తుంది. బల్ల గుద్ది చెప్తున్నా.. ఇది జరిగి తీరుతుంది” అన్నారు.
ఇవి కూడా చదవండి: నభా, ధ్రువ.. కెమిస్ట్రీ!