78వ సినిమా టైటిల్ సిద్ధం!
రవితేజ కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో (Director Vivek Athreya)ఓ క్రేజీ చిత్రం రానుంది. ఈ ప్రాజెక్టును మేకర్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. రవితేజ కెరీర్‌లో 78వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘ఆర్‌టీ78’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ ప్రాజెక్టును ది బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీని రావు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా, శుక్రవారం ఈ మూవీటీమ్ ఓ అప్‌డేట్ పంచుకుంది.
సాధారణంగా పోస్టర్లు, గ్లింప్స్ కాకుండా, ఒక ‘టైటిల్ డాక్యుమెంటరీ’ ద్వారా సినిమా పేరును అక్టోబర్ 11న విడుదల చేయనున్నారు. చిత్రబృందం విడుదల చేసిన నోట్లో కూడా ‘ఒకడు హారర్ సినిమా అంటాడు.. ఇంకొకడు ఏదో అంటాడు.. ఇంతకీ ఏంటో అక్టోబర్ 11న చూద్దాం’ అంటూ ఈ జోనర్ రూమర్లపై మరింత క్యూరియాసిటీ పెంచింది. హారర్ కామెడీ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రానికి ‘తులాభారం’ అనే టైటిల్‌తో రానుందని ఫిలింనగర్ సర్కిళ్లలో వినవస్తున్న టాక్.
రవితేజ తన సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు పూర్తి స్థాయి హారర్ కామెడీ జోనర్‌నున టచ్ చేయలేదు. వివేక్ ఆత్రేయ మార్క్ ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లే, హారర్ ఎలిమెంట్స్‌కు రవితేజ కామెడీ టైమింగ్ తోడైతే థియేటర్లలో నవ్వుల జాతర ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు క్రేజీ భామలు కథానాయి కలుగా నటించబోతున్నట్లు టాక్. అందులో ఒకరు టాలీవుడ్ లక్కీ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్, మరొకరు మలయాళీ కుట్టి అనస్వర రాజన్ అని ప్రచారం సాగుతోంది. ఇందులో పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం సీని యర్ నటుడు జేడీ చక్రవర్తిని సంప్రదించారని తెలిసింది. రవితేజ, జేడీ చక్రవర్తి మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట.