డింపుల్‌ను సింపుల్‌గా చూపించారేం?!
శర్వానంద్(Sharwanand) హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కించిన పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి' సినిమా(Bhogi Movie) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులు, మివర్శకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంటోంది. అయితే సినిమాపై వస్తున్న స్పందనలో డింపుల్ హయతి(Dimple Hayathi) పాత్ర కూడా చర్చనీయాంశంగా మారింది. సినిమాలో ఆమెకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిందని కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.
టికెట్ కోసం రూ.350 ఖర్చు చేసినా డింపుల్ హయతి పాత్రలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకునే సన్నివేశాలు లేవని కొందరు సినిమా ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డింపుల్ అందం సింపుల్‌గా ఉండదని, గ్లామర్‌కు పెట్టింది పేరైన ఆమె అందాన్ని ఆస్వాదించాలని థియేటర్‌కు వెళ్లిన తమను నిరాశ పరిచారని చెబుతున్నారు. ఆమె పాత్రకు మరింత స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఉంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాలో డింపుల్ హయతి మందారం పాత్రలో కనిపించింది. అయితే కథలో ఆమె పాత్రకు తగినంత ప్రాధాన్యత లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొన్ని సినిమా సమీక్షల్లోనూ ఆమె పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సిందనే అభిప్రాయాలు వెలువడ్డాయి. శర్వానంద్ నటన, సినిమా కథనం, యాక్షన్ సన్నివేశాలపై కూడా ప్రేక్షకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి భోగి సినిమా విడుదలైన తొలిరోజే సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.